వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అక్కినేని తన అభిమానులను పెంచుకుంటూ పోతోంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మొదటిసారిగా వెబ్ సిరీస్‌లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేస్తోంది. సెప్టెంబర్‌లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్‌కు సీక్వెల్‌గా ఫ్యామిలీ మెన్ 2 వస్తోంది. ఈ సందర్భంగా సామ్ 'ద ఫ్యామిలీ మెన్ 2'కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
వెబ్ సిరీస్‌లో సామ్.. చైతూ వెయిటింగ్